Anasuya Bharadwaj| అందాల అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. యాంకర్‌గా అలరించిన అనసూయ రంగస్థలం చిత్రంతో నటిగా మారింది.ఇక అక్కడి నుండి అనసూయ పలు చిత్రాలలో నటిస్తూ అలరిస్తుంది. ఇటీవల పుష్ప చిత్రంలో అనసూయ దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది. అలానే హరిహర వీరమల్లు చిత్రంలో కూడా అనసూయ తన అందచందాలతో అదరగొట్టనుంది. అయితే అనసూయ అందాల ఆరబోత రోజురోజుకూ శృతిమించుతోంది. ఈ మధ్యకాలంలో రెచ్చిపోతోంది రంగమ్మత్త.
సోషల్ మీడియాలో ఆనసూయ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. కొద్ది రోజుల పాటు అనసూయ రెచ్చిపోయే విధంగా గ్లామర్ షో చేసింది. కొద్ది రోజులుగా చీరకట్టులో కనిపిస్తూ అదరగొడుతుంది. రీసెంట్గా ఫ్లవర్ ప్రింటెడ్ కాటన్ శారీకి వైట్ కలర్ నెక్ బ్యాండ్ స్లీవ్ లెజ్ బ్లౌజ్ వేసుకొని అజంతా శిల్పంగా పోజులిస్తూ ఫోటోషూట్ చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ చీరలోను కాకరేపుతున్నావుగా అని కామెంట్ చేస్తున్నారు. తాజాగా పట్టు చీరలో కాక రేపే విధంగా కనిపించి కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేసింది. అనసూయని ఇలా చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
అంతా బాగానే ఉంది కాని ఎందుకు అంత సీరియస్‌గా ఉన్నావు అనసూయ అని కామెంట్ చేస్తున్నారు. 40 ఏళ్ల వయసున్న ఈ జబర్దస్త్ లేడీ తెలివిగా తన అంద, చందాల్ని సొమ్ము చేసుకుంటోంది. యాంకర్‌గా కెరియర్ బిగన్ చేసిన రంగమ్మత్త ఆ తర్వాత కామెడీ షోకి హోస్ట్ గా వ్యవహరించి మంచి పేరుతో పాటు సినిమాల్లో వెళ్లే రూట్ ఏర్పాటు చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాలలో వెరైటీ పాత్రలు పోషిస్తూ అదరహో అనిపిస్తుంది. అనసూయ షేర్ చేసిన ఏ పిక్ అయిన కూడా కొద్ది నిమిషాలలోనే నెట్టింట వైరల్ అవుతుంది.ఏదేమైన అనసూయ ఇంకా తన వయసు స్వీట్ ట్వింటీ అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా నెటిజన్ల చూపులు తనవైపు తిప్పుకునేందుకు పలుచని చీరలో పరువాలు ఒలకబోస్తుంది.