Niharika| మెగా బ్రదర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన నిహారిక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. అయితే నిహారిక నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో వివాహం చేసుకుంది. ఒక మనసు చిత్రం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలలో నటించింది. ఈ సినిమాలేవి నిహారికకి కలిసి రాలేదు. ఇక చేసేదేమి లేక ఈ భామ సీనియర్ ఐపీఎస్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను తాను పెళ్లి చేసుకుంది.2020 డిసెంబర్లో వీరి విహహాం ఘనంగా జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ కొన్నాళ్లకే విడిపోయారు.
ఇక విడాకుల తర్వాత నిహారిక నటిగా ప్రేక్షకులను ఓవైపు అలరిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గాను గుర్తుండిపోయే చిత్రాలను నిర్మిస్తోంది. అయితే నిహారిక సోషల్ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూలోను తన పర్సనల్ విషయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉంటుంది. రీసెంట్గా నిహారిక తన డివోర్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.ఏ ఒక్కరు కూడా డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనతో పెళ్లి చేసుకోరు అని నిహారిక పేర్కొంది. కొన్ని కఠిన నిర్ణయాలు మనల్ని బలవంతం చేస్తాయి. విడాకులు అనేది జీవితంలో కష్టమైన డెసిషన్. అది కావాలని ఎవరు తీసుకోరు అని నిహారిక పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే సందర్భంగా నిహారిక తన ఇన్‌స్టాలో సుస్మితతో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. నా పార్ట్ టైమ్ అమ్మ, ఫుల్ టైమ్ అక్క అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను అంటూ నిహారిక తన పోస్ట్ల్ లో పేర్కొంది. నిహారిక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నిహారిక నిర్మాతగా చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి హిట్ కాగా, తర్వాత ఏ సినిమా నిర్మిస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.