Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందాన్న ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 ది రూల్, యానిమల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ భామ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతుంది. రష్మిక తాజాగా నటించిన చిత్రం ఛావా. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
రష్మిక మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయిన కూడా ముంబై ప్రేక్షకులు నామీదా చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే సంతోషంగా ఉంది అంటూ చెప్పుకోచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు ఈ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తప్పు పడుతున్నారు. రష్మిక ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిందో అప్పుడే మర్చిపోయిందా.. విరాజ్పేట్ అనే గ్రామం (రష్మిక సొంతూరు) హైదరాబాద్‌కు ఎప్పుడు షిప్ట్ అయ్యింది. సొంత ఊరు గురించి చెప్పడానికి సమస్య ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రష్మిక కెరీర్ విషయానికి వస్తే.. రక్షిత్ శెట్టి నటించిన కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టి, రష్మిక ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అనుకొని కారణాల వలన ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌కి షిప్ట్ అయిన రష్మిక ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకేవ్వరు, భీష్మా, పుష్ప 1.2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.