కన్నడ లేటెస్ట్ హిట్ ‘సు ఫ్రమ్ సో’ చిత్రం ఆగస్ట్ 8న తెలుగులో విడుదల కానుంది. షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, సంధ్య, ప్రకాష్ కె.తుమినాడ్, దీపక్ పనాజే, మైమ్ రాందాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జేపీ తుమినాడ్ దర్శకుడు. శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలసా, రాజ్ బి శెట్టి నిర్మాతలు.
కన్నడలో విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఆసక్తికరమైన కథ, కథనాలు, పాత్రల పోకడలు ఈ సినిమాకు ప్రధాన బలమని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నవ్వుల విందు చేయనున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఈచిత్రానికి కెమెరా: ఎస్.చంద్రశేఖరన్, సంగీతం: సుమేద్.కె.