కన్నడ (Kannada Industry) సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. టీవీ నటి సౌజన్య (Soujanya) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన సావి మడప్ప (సౌజన్య అసలు పేరు) బెంగళూరు దక్షిణ తాలూకాలోని దొడ్డబెలే గ్రామంలోని తన అపార్టుమెంట్ లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యను భరించలేక ఈ పని చేసుకుంటున్నానని, అమ్మానాన్న, కుటుంబసభ్యులు, స్నేహితులు తనను క్షమించాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది సౌజన్య.
ఆత్మహత్యకు నాదే బాధ్యత. అందువల్లే కుటుంబసభ్యులంతా నన్ను క్షమించండి. నా జీవితంలో ఆత్మహత్య లాంటి పనులు ఎప్పుడూ చేయనని వాగ్దానం చేశాను. కానీ నాకు వేరే అవకాశం లేదు. నేను అంతర్గతంగా మొత్తం చనిపోయాను. రోజురోజుకీ నేను మునుపటి కంటే ఎక్కువగా బలహీన పడ్డాను. ఈ ఏడాది జనవరిలో కన్నడ బిగ్ బాస్ కంటెస్టంట్ జయశ్రీ రామయ్య (Jayasree Ramaiah)ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి బలవన్మరణం చెందడంతో విషాదంలో మునిగిపోయింది కన్నడ చిత్ర పరిశ్రమ.
కోవిడ్ లాక్ డౌన్ తర్వాత పలువురు టెలివిజన్, సినీ నటీనటులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. తాము ఒత్తిడికి లోనవుతున్నట్టు కొందరు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన