Actor Upendra | కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర కుటుంబం సైతం సైబర్ నేరగాళ్ల బారినపడింది. ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది. తన భార్య ఫోన్ నంబర్ల నుంచి మెస్సేజ్‌లు పంపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. మెస్సేజ్‌లకు స్పందించవచ్చని నటుడు ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘జాగ్రత్తగా ఉండండి’ అనే క్యాప్షన్‌తో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రియాంక ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. హ్యాకర్లు మెస్సేజ్‌లు పంపిస్తూ యూపీఐ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. హ్యాకర్లు సెలబ్రిటీ జంటగా పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ నెంబర్లు, పేరుతో వచ్చే మెస్సేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉపేంద్ర భార్య ప్రియాంక సైతం హ్యాకర్లు తమకు తెలిసిన కొందరికి మెస్సేజ్ చేసి రూ.55వేలు డిమాండ్ చేసినట్లుగా స్క్రీన్‌షాట్‌ని షేర్ చేసింది.
డబ్బులు పంపే సమయంలో పరిచయం ఉన్న వ్యక్తులు ఫోన్ చేశారని.. హ్యాకర్ తర్వాత మాట్లాడుతానని చెప్పి రూ.55వేలు పంపాలని.. చాలా అత్యవసరం ఉందని చెప్పినట్లుగా ప్రియాంక తెలిపింది. హ్యాకింగ్ అంశంపై ఉపేంద్ర-ప్రియాంక జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారాన్ని చెప్పినందుకు నెటిజన్లు ఉపేంద్ర, ప్రియాంక జంటకు ధన్యవాదాలు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు.