Darshan | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్‌ను మైసూరులోని తన ఫాంహౌస్‌లో అరెస్ట్ చేశారు. దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధింపులకు గురిచేసినందు వల్లే రేణుకాస్వామి హత్యకు గురైనట్టుగా చెబుతున్నారు.
రెండు నెలల క్రితం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని మైసూరులోని దర్శన్ ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారని, అక్కడే అతడిని హింసించి చంపేసిన అనంతరం కామాక్షిపాల్యలోని కుంటలో మృతదేహాన్ని పడేశారని పోలీసులు చెబుతున్నారు.
చిత్రదుర్గలో నమోదైన మిస్సింగ్ కేసు ఫిర్యాదులో భాగంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. విచారణలో ఆర్థిక సమస్యల కారణంగానే రేణుకాస్వామిని హత్య చేశామని ముగ్గురు వ్యక్తులు లొంగిపోయారు.
అయితే తదుపరి విచారణలో దర్శన్ పేరు తెరపైకి రాగా.. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి పవిత్రగౌడకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనేది చూడాలి.
Karnataka’s actor famously known as the “Rowdy of Sandalwood” and the most vile and disgusting person to ever have been in Kannada Film Industry @dasadarshan arrested in connection with a murder #Darshan pic.twitter.com/YgLUfYIttM
— Arjun (@arjundsage1) June 11, 2024