ఇంటర్వ్యూల్లో తెలివిగా, లౌక్యంగా సమాధానాలిస్తుంటారు హీరోయిన్లు. కానీ కంగనారనౌత్ సమాధానాలు అలా ఉండవు. సూటిగా ఉంటాయి. మనసులో ఉన్నది చెప్పేయటమే. దాచుకోవడాలు ఉండవు. రీసెంట్గా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘మీరు ఏ దర్శకుడితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు?’ అనడిగితే “ఎస్.ఎస్.రాజమౌళి” అంటూ తడుముకోకుండా చెప్పేసింది కంగనా. ఇంకా చెబుతూ “ భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారాయన. రాజమౌళి కథ చెప్పే తీరు అద్భుతం. ఆయనో మాస్టర్ స్టోరీ టెల్లర్. అందుకే ఆయన సినిమాలో అవకాశం వస్తే వదులుకోను.” అని చెప్పేసింది.
‘ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు?’ అనే మరో ప్రశ్నకు సమాధానంగా “రామ్చరణ్” అని చెబుతూ “ ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ నటన వండర్. సునిశితమైన భావాలను సైతం అద్భుతంగా పలికించారాయన. కుదిరితే ఆయనతో జతకట్టాలని ఉంది” అని సూటిగా సమాధానాలిచ్చేసింది కంగనా.