Kangana Ranaut | రీసెంట్గా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న కంగనారనౌత్కు ‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు? ఒకవేళ చేసుకుంటే నటుడ్ని చేసుకుంటారా? రాజకీయ నాయకుడ్ని చేసుకుంటారా? అనే ప్రశ్న ఎదురైంది. దానిపై తనదైన శైలిలో స్పందించింది కంగనా. ‘పెళ్లంటే ప్రత్యేకమైన ద్వేషం ఏమీలేదు. మనిషి అన్న తర్వాత తోడు అవసరం. లెగసీ కొనసాగాలంటే పిల్లలు అవసరం.
అందుకే పెళ్లి తప్పకుండా చేసుకోవాల్సిందే. అయితే.. నా మాట తీరువల్లో లేక ముక్కుసూటి తనం వల్లో నాపై నెగటివ్ ప్రచారం జరిగింది. దాంతో కొంతవరకూ అపఖ్యాతి పాలయ్యా. వీటికి తోడు కోర్టు కేసులు. అందుకే.. పెళ్లికి దూరంగా ఉంటున్నా.
ఒకవేళ చేసుకున్న తర్వాత కోర్టు నుంచి సమన్లు వస్తే.. వాటిని చూసి మా అత్తామామ పారిపోతారు..’ అంటూ పకపకా నవ్వేసింది కంగనారనౌత్. ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఇందిరాగాంధీ బయోపిక్ ‘ఎమర్జెన్సీ’ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.