Kangana Ranaut | నా ఆలోచనా విధానాన్ని వాళ్లు అర్థం చేసుకోలేదు.. హాట్ టాపిక్‌గా కంగనా రనౌత్ కామెంట్స్
kangana ranaut | ఇండస్ట్రీలో ముక్కుసూటితనంతో మొహమాటం లేకుండా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే అతికొద్ది నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది కంగనారనౌత్. ప్రస్తుతం భారత్ భాగ్య విధాత సినిమాలో నటిస్తోంది కంగనా.
Kangana Ranaut | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే చాలా కష్టమని తెలిసిందే. అందులోనా ప్రత్యేకించి సినీ పరిశ్రమలో రాణించాలనుకునే అమ్మాయిలు ఎన్నో కష్టాలను అధిగమిస్తే కానీ సక్సెస్‌ను అందుకోలేరు. అలా సక్సెస్‌ఫుల్‌గా స్టార్డమ్ సంపాదించుకోవడమే కాదు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ చట్టసభల్లోకి అడుగుపెట్టింది బాలీవుడ్ భామ కంగనారనౌత్. ఇండస్ట్రీలో ముక్కుసూటితనంతో మొహమాటం లేకుండా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే అతికొద్ది నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది కంగనారనౌత్.
ప్రస్తుతం భారత్ భాగ్య విధాత సినిమాలో నటిస్తోంది కంగనా. ఈ మూవీ ట్రైలర్‌కు మంచిస్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఓ చిట్ చాట్ సెషన్లో తన వ్యక్తిగత జీవిత ప్రయాణం, ప్రొఫెషనల్ జర్నీ, సినిమా గురించి కంగనారనౌత్ పలు విషయాలు షేర్ చేసుకుంది. తన తల్లిదండ్రులు తన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేదంటూ కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకుంది.
తాను ఇండస్ట్రీకి 16, 17 ఏండ్ల వయస్సులో ఎంట్రీ ఇచ్చానని.. ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను చిత్రాల్లో మంచి సక్సెస్ అందుకున్నానని చెప్పింది. అయితే తాను మంచి స్టార్డమ్ సంపాదించినప్పటికి ఎల్లప్పుడూ తన ఎదుగుదల ఇండస్ట్రీలో తన చుట్టూ ఉన్నవారికి నష్టం కలిగించకూడదని నమ్మానని చెప్పింది కంగనా.
తన సక్సెస్‌తోపాటు ఇతరులను కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే కోరిక తనకు ఎప్పుడూ ఉండేదని, ఈ నమ్మకం సిల్వర్ స్క్రీన్‌పై, స్ర్కీన్ వెనుక తన నిర్ణయాలను ప్రభావితం చేస్తూనే ఉందని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also :
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

