Emergency | బాలీవుడ్ క్వీన్, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కీ రోల్లో నటించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) సినిమా మరోసారి వాయిదా పడింది. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈ నెల 6న (ఇవాళ) విడుదల చేయనున్నట్లు కంగన ప్రకటించారు.
అయితే, ఇప్పుడు కూడా ఈ చిత్రం వాయిదా పడింది. ఎమర్జెన్సీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు కంగన శుక్రవారం ఉదయం ఎక్స్ వేదికగా ప్రకటించారు. సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదని తెలిపారు. దాని కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
With a heavy heart I announce that my directorial Emergency has been postponed, we are still waiting for the certification from censor board, new release date will be announced soon, thanks for your understanding and patience 🙏
— Kangana Ranaut (@KanganaTeam) September 6, 2024
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. అయితే, సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఈ కారణాలతో ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటి వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..
BJP Manifesto | జమ్మూ కశ్మీర్ ఎన్నికలు.. నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా
Underwear Gang | నాసిక్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ
Killer wolfs | బహరాయిచ్ ప్రజలను బెంబేలెత్తిస్తున్న తోడేళ్లు.. మరో చిన్నారిపై దాడి