Kangana Ranaut | ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్.. ఇలా ప్లాట్‌ఫాం ఏదైనా తనదైన బోల్డ్ కామెంట్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది బాలీవు్డ్ భామ కంగనరనౌత్. చివరగా ఎమర్జెన్సీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ గ్లామరస్ రోల్స్ చేయక చాలా కాలమే అవుతుంది. అయితే ఈ బ్యూటీ మళ్లీ తనలోకి గ్లామర్ యాంగిల్‌ను చూపించేందుకు రెడీ అవుతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న తాజా కథనాల ప్రకారం కంగనారనౌత్ డైరెక్టర్లు వికాస్ బహల్, ఆనంద్ ఎల్ రాయ్‌తో మరోసారి కలిసి చేయబోతుందట. కంగనారనౌత్ ఈ సారి హిట్ ప్రాజెక్టుల సీక్వెల్స్‌తో ట్రాక్‌పైకి వచ్చేలా క్వీన్ 2, తను వెడ్స్ మను 3 సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. కంగనా ఈ ఏడాది నవంబర్ నుంచి క్వీన్ సీక్వెల్ షురూ చేయనుందని సమాచారం. వికాస్ బాల్ ఇప్పటికే క్వీన్ సీక్వెల్ రెడీ చేశాడని.. ప్రస్తుతం యూకేలో లొకేషన్ల వేటలో ఉన్నాడని బాలీవుడ్ సర్కిల్ సమాచారం.
సీక్వెల్ మొదటి పార్ట్ లాగే ఇండియాతోపాటు ఓవర్సీస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగనుందని తెలుస్తోంది. ఇక క్వీన్ 2 పూర్తి చేసిన తర్వాత తను వెడ్స్ మను 3ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అవగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్కిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. తేరే ఇష్క్ మే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనని బీటౌన్ సర్కిల్ సమాచారం. మొత్తానికి ఓ వైపు ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉన్న కంగనారనౌత్.. ఇక సీక్వెల్స్‌తో మళ్లీ ఫాంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తాజా కథనాలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
Anjali Raghav | అనుచితంగా హీరోయిన్ నడుము తాకిన స్టార్ నటుడు.. వివాదంపై స్పందించిన నటి
Vishal – Dhansika | ఇద్దరు ఒక్క సినిమా కూడా చేయలేదు.. విశాల్, ధన్సిక మధ్య ప్రేమ ఎలా పుట్టింది?