కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలు సినిమాలో శక్తివంతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. జూన్ 3న విక్రమ్ విడుదల కానుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఆసక్తికరంగా ఉండి, కొత్త తరహా సినిమా అనే అంచనాలను ఏర్పర్చాయి. సినిమా విడుదల తేదీ ప్రకటన సందర్భంగా కమల్ హాసన్ స్పందిస్తూ…‘ప్రపంచవ్యాప్తంగా ‘విక్రమ్’ మీ ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఆ తేదీ కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. కాళిదాసు జయరామ్, నరేన్, శివానీ నారాయణన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్.