Pushpaka Vimanam | మాటలు లేకుండా తీసిన సినిమాకు 35 ఏండ్లు.. పుష్పక విమానం స్టోరీ ఇది
Pushpaka Vimanam | ఉలుకూ పలుకూ లేకుండా నాలుగు ఆటల చొప్పున వందరోజులు ఆడి మాటలకందని విజయం సాధించిన చిత్రం ‘పుష్పక విమానం’. సింగీతం శ్రీనివాసరావు, కమల్‌హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదలై 35 ఏండ్లు.
Pushpaka Vimanam | సినిమాలో మూడు నిమిషాలు ఏ డైలాగ్సూ లేకపోతే బోర్‌గా ఫీలవుతాం! అలాంటిది.. ఏ మాటా లేకుండా రెండున్నర గంటల సినిమా నడపడం అంటే.. మాటలా! ఉలుకూ పలుకూ లేకుండా నాలుగు ఆటల చొప్పున వందరోజులు ఆడి మాటలకందని విజయం సాధించిన చిత్రం ‘పుష్పక విమానం’. సింగీతం శ్రీనివాసరావు, కమల్‌హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విడుదలై 35 ఏండ్లు. ఇప్పటికీ ఈ సినిమా ప్రసారమైతే ఆ పూటకు మాటలన్నీ కట్టిపెట్టి టీవీకి అతుక్కుపోయే అభిమానులు ఎందరో.
కథలోకి వెళ్తే.. అనగనగా ఒక నిరుద్యోగి. పక్కా దురాశావాది! ఎంతలా అంటే.. తన దగ్గరున్న సింగిల్ కాయిన్‌ను పైకెగరేసి బిచ్చగాడిని గేలి చేసే రకం. ఆ బిచ్చగాడు తన దగ్గరున్న నోట్లు చూపించి, వాటితో దర్జాగా గాలి విసురుకుంటూ విసురుగా చూడటంతో తత్తరపడే పిరికి కూడా. అలాంటివాడికి అనుకోకుండా ఓ సంపన్నుడు తారసపడతాడు. అతని పేరుతో కథానాయకుడు ‘పుష్పక్’ అనే ఫైవ్‌స్టార్ హోటల్లో మకాం వేస్తాడు. శ్రీమంతుడిగా చలామణీ అవుతాడు. ఈ క్రమంలో ఓ యువతితో ప్రేమలో పడతాడు. ఒకరోజు తన ఎదుట సంపన్నుడిగా ప్రత్యక్షమై, నోట్ల కట్టలు చూపించిన కథానాయకుణ్ని చూసి బిచ్చగాడు ఓ వెకిలి నవ్వు నవ్వుతాడు. ఇంకోరోజు ఆ బిచ్చగాడు చనిపోతాడు. ముష్టి ఎత్తుకొని అతను సంపాదించుకున్న సొమ్మంతా గాల్లో ఎగిరిపోతుంది. ఆ సన్నివేశంతో డబ్బు కన్నా జీవితంలో విలువైనది సంతృప్తి.. అని హీరో గ్రహించడంతో కథ ముగుస్తుంది.
సింగీతం అంటేనే సినీ శాస్త్రవేత్త. ఆయన ప్రయోగాలకు పక్కా వేదిక కమల్‌హాసన్. కమల్‌తో ఆయన చేసిన ప్రయోగాలన్నీ ఎలాంటి ఉత్ప్రేరకాలు లేకుండానే విజయవంతం అయ్యాయి. అలాంటి సినిమాల్లో ఒకటి పుష్పక విమానం. అమల, టినూ ఆనంద్, పీఎల్ నారాయణ తదితర నటీనటుల పరిణతి కలిగిన పెర్ఫార్మెన్స్ ‘పుష్పక విమానం’ చిత్రాన్ని క్లాసిక్స్ జాబితాలో చేర్చింది. ఎందరు కూర్చున్నా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందని పురాణ కథనం. ఎన్ని కోరికలు తీరినా మనిషి ఇంకేదో కావాలనుకుంటాడని ఈ సినీ ‘పుష్పక విమానం’ చెబుతున్నది. చివరగా ఈ చిత్రం ఎన్నిసార్లు చూసినా ఇంకొక్కసారి చూడాలన్న కోరిక మాత్రం సగటు ప్రేక్షకుడికి మిగిలే ఉంటుంది.
Read More :
సగం ధరకే జియో బహమతుల ఇస్తామని.. జీవితా రాజశేఖర్‌కు లక్షన్నర టోకరా
pavitra Lokesh | సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

