కమల్ హాసన్ మిస్టర్ పర్ఫెక్ట్.. అప్పుడే షూటింగ్‌కు వచ్చేసాడు
కమల్ హాసన్ | టైమింగ్ అంటే ఇలా ఉండాలి. నిన్నటివరకు ఎన్నికలతో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్. ఈయన కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాడు.

టైమింగ్ అంటే ఇలా ఉండాలి. నిన్నటివరకు ఎన్నికలతో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్. ఈయన కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాడు. అందుకే కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రజాసేవ కోసం కావాలంటే సినిమాలు కూడా త్యాగం చేస్తానని.. తనకు జనం కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు లోకనాయకుడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. దాంతో మళ్ళీ సినిమా షూటింగ్ కు వచ్చేశాడు కమల్. శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఇండియన్ 2 సినిమా ఆగిపోయింది. దాంతో పాటే మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమా కమిట్ అయ్యాడు కమల్ హాసన్.
కెరీర్లో 232వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
గతేడాది కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అప్పటి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఎన్నికల్లో తన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ ప్రచారంలో బిజీ అయిపోయాడు కమల్.
అందుకే షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 6న తమిళనాడు అన్ని నియోజక వర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అందులో తాను కూడా పోటీ చేశాడు. అయినా కూడా ఫలితాల కోసం వేచి చూడకుండా వెంటనే ‘విక్రమ్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు కమల్ హాసన్.
తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ‘ఆరంభిద్దామా’ అని సినిమాలోని డైలాగ్ ని క్యాప్షన్ గా పెట్టాడు. ఈ మధ్యే కరోనా బారిన పడి కోలుకున్నాడు లోకేష్ ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో లోకేష్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఖైదీ’,’మాస్టర్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ‘విక్రమ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయాలు లేని కమల్ హాసన్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

