కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘నాయగన్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘కమల్‌హాసన్ 234’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తుదిదశకు చేరుకుందని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం మే 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించబోతున్నారని తెలిసింది. దాదా పు 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్‌హాసన్‌తో చేస్తున్న ఈ సినిమా గురించి మణిరత్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. నాటి ‘నాయగన్’ తరహాలోనే ఉత్తమ చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఆయన ఉన్నారని అంటు న్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు ముందుగానే కమల్‌హాసన్ పాత్ర తాలూకు ఓ ప్రోమోను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో త్రిష, నయనతార కథానాయికలుగా నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.