Kamal Haasan | విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సొంత పార్టీ కార్యకర్తలనే అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త అభిమానంతో ఆయనకు కత్తిని బహూకరించారు. అంతటితో ఆగకుండా ఆయన చేతికి ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఈ అనూహ్య పరిణామంతో వేదికపై గందరగోళం నెలకొన్నది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఘటన జరిగింది. కార్యక్రమం సాగుతున్న సమయంలో వేదికపైగా చేరుకొని కార్యకర్తలు ఆయనకు ఓ భారీ కత్తిని బహూకరించారు.
అయితే, అభిమానులు ఇచ్చిన కానుకను కమల్ స్వీకరించారు. మొదట నవ్వుతూనే కత్తిని కమల్ కత్తిని చేతితో పట్టుకున్నారు. ఈ సమయంలో మరో కార్యకర్త బలవంతంగా కత్తిని ఒరలో నుంచి తీసి కమల్ చేతికి బలవంతంగా అందించేందుకు యత్నించాడు. కత్తిని చేతులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. పదేపదే తీసి చేతికి ఇచ్చేందుకు ప్రయత్నించగా కమల్ ఆగ్రహానికి గురయ్యారు. ఓ కార్యకర్తను కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. వెంటనే అక్కడే ఉన్న పోలీస్ అధికారి స్పందించి.. కార్యకర్తను నిలువరించి కత్తిని పక్కనపడేశారు. ఆ తర్వాత కార్యకర్తలు కమల్ హాసన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పట్టుబడడంతో భద్రతా సిబ్బంది వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
VIDEO | Chennai: Actor and MNM Chief Kamal Haasan (@ikamalhaasan) gets angry at man who gifts him a sword during party meeting.#KamalHaasan_MP
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/5H9KZXBoEn
— Press Trust of India (@PTI_News) June 14, 2025