Kamal Hasan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు జాతీయ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. షారుఖ్‌తో పాటు విక్రాంత్ మాస్సే, రాణీ ముఖర్జీ తదితరులు అవార్డులు గెలుచుకున్నారు. అయితే షారుఖ్ ఖాన్‌తో పాటు ఉత్తమ నటుడు, నటి అవార్డులు గెలుచుకున్న నటులకు దిగ్గజ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు “జవాన్” చిత్రానికి గాను జాతీయ అవార్డు లభించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ గుర్తింపు షారుఖ్ సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవబోతుంది. అతడి అద్భుతమైన నటనకు, సినిమాపై ఆయనకున్న నిబద్ధతకు ఇది తగిన గౌరవం అని కమల్ రాసుకోచ్చాడు.
అలాగే నన్ను ఎంతగానో కదిలించిన చిత్రం 12th ఫెయిల్. ఈ చిత్రం మూవీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా.. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రానికి గాను దర్శకుడు విధు వినోద్ చోప్రా, నటుడు విక్రాంత్ మాస్సేలకు జాతీయ అవార్డులు లభించడం ఆనందగా ఉంది. వారికి నా శుభాకాంక్షలు. తన అద్భుతమైన నటనకు గాను నటి రాణి ముఖర్జీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పాత్రలో చూపిన ధైర్యం, సున్నితత్వం కలగలిసిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ జాతీయ పురస్కారం ఆమె నటనకు దక్కిన నిజమైన నిదర్శనం అంటూ కమల్ రాసుకోచ్చాడు.
Congratulations to @iamsrk on your National Award for Jawan, a recognition long overdue for your stellar impact on world cinema.
12th Fail was a masterpiece that moved me deeply. It dignified struggle and inspired millions. Congratulations Vidhu Vinod Chopra and @VikrantMassey…
— Kamal Haasan (@ikamalhaasan) August 2, 2025