కమల్‌హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం భారతీయ కల్ట్‌క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మళ్లీ 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లివింగ్ లెజెండ్స్ ఇద్దరూ ‘థగ్‌లైఫ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ‘పొన్నియన్ సెల్వన్’ వంటి బ్లాక్‌బస్టర్ సిరీస్ చిత్రాల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రమిదే కావడంతో దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. గురువారం కమల్‌హాసన్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 5న విడుదల చేయబోతున్నారు. టీజర్ యాక్షన్ హంగులతో ఆకట్టుకుంది. విజువల్స్‌ను బట్టి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అర్థమవుతున్నది. కమల్‌హాసన్ గెటప్, లుక్స్ విభిన్నంగా కనిపించాయి. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, కమల్‌హాసన్ నటవిశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, అభిరామి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, రచన-దర్శకత్వం: మణిరత్నం.