వినయ్వర్మ, తమేశ్వరయ్య, చంద్రకళ ఎస్, అర్జున్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఎన్హెచ్ ప్రసాద్ రూపొందిస్తున్నారు. శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘శృంగార వాంఛల నేపథ్యంలో సాగే కథ ఇది.
అయితే ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కవితాత్మకంగా తెరకెక్కించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందంలోని కొన్ని కవితలను మా సినిమాలో ఉపయోగించుకున్నాం. నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని యథార్థ సంఘటనలను చూపించాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండీ అద్దంకి, నిర్మాత, దర్శకత్వం: ఎన్హెచ్ప్రసాద్.