తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Temple) వారిని టాలీవుడ్ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శించుకున్నాడు.
కల్కి సినిమాతో గతేడాది సూపర్ హిట్ అందుకున్న ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తిరుమల (Tirumala) శ్రీవారిని (Sri Venkateswara Temple) దర్శించుకున్నాడు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో తిరుమలకి చేరుకున్న నాగ్ అశ్విన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అతడికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.