Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా ఇంకా జోరు తగ్గట్లేదు. దీనికి పోటీ ఇచ్చే మరో పెద్ద సినిమా లేకపోవడం గత రెండు వారాల నుంచి మరో చిత్రం విడుదల కాకపోవడంతో ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన ఈ చిత్రం ఈ వారం అయ్యేలోపు మరో రూ.100 కోట్లు సాధించేటట్లు ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో షారుఖ్ ఖాన్ రికార్డ్‌ను బద్దలుకొట్టింది.
ప్రముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (12.01 మిలియన్ టికెట్లు)పేరిట ఉండగా.. తాజాగా ఈ రికార్డును కల్కి అధిగమించింది. ఇక రానున్న వారం డార్లింగ్ తప్ప మరో సినిమా లేకపోవడంతో ఈ టికెట్ కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బయ్యర్లు అంచనా.
Also Read..