Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ సినిమా నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గత ఏడాది 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొనే, దిశా పటానీ, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా నేటికి ఏడాది పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో వన్ ఇయర్ ఫర్ కల్కి అంటూ ట్రెండింగ్ మొదలైంది. ప్రభాస్‌తో కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
We started with a dream… and you turned it into an epic.
Celebrating 1 YEAR of #Kalki2898AD ❤️Thank you to the audience. This journey is yours as much as ours. 🙏🏻#1YearForKalki2898AD #1YearForKalkiKARNAge@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7… pic.twitter.com/hansPMpe8a
— Kalki 2898 AD (@Kalki2898AD) June 27, 2025
Read More