Kalki 2898 Ad | ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారా.. అయితే మీకు ఒక అలర్ట్. మీరు బుక్ చేస్తున్నా కల్కి చిత్రం ప్రభాస్ కల్కి నా లేక.. డా. రాజశేఖర్ కల్కి నా చేక్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏమైంది అంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే. బుకింగ్స్ మొదలయిన వెంటనే థియేటర్స్ అన్ని సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి. అయితే ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్ అవుతుంటే సైలెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది రాజశేఖర్ కల్కి.
బుక్‌మై షో, పేటీఎం, జస్ట్ టికెట్స్ వంటి టికెట్ బుకింగ్ వెబ్‌సైట్స్‌లలో ప్రభాస్ కల్కి సినిమాను బుక్ చేసుకోగా రాజశేఖర్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి’ మూవీకి టికెట్ బుక్ అయినట్లు కనిపించింది. టికెట్‌ను త్వరగా బుక్ చేసుకోవాలన్న తొందరలో అభిమానులు ఏ సినిమాకు బుక్ చేస్తున్నామనేది కూడా గమనించలేదు. అయితే దీనిపై బుక్ మై షో నుంచి వివరణ కోరగా.. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగింది. ఎవరు అందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రాజశేఖర్ ‘కల్కి’టికెట్లనే ‘కల్కి 2898 ఏడీ’ టికెట్లనే భావిస్తాం.. ఆ టికెట్ చూపించే మీరు ప్రభాస్ కల్కి సినిమా చూడవచ్చు అంటూ తెలిపింది.
మరోవైపు ఈ ఘటనపై నటుడు రాజశేఖర్ కూడా స్పందించారు. కల్కి టికెట్ల విషయంపై ‘నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే ప్రభాస్, అశ్వినీదత్ తో పాటు కల్కి 2898 ఏడీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కల్కి’. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించాడు. 2019లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.