Cinema News | తండ్రుల సోషియో ఫోబియో నేపథ్యంలో..
ప్రస్తుతం చాలామంది తండ్రులు సోషియో ఫోబియోతో ఉన్నారు. పిల్లల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా, నా కొడుకు ఇలా ఉండాలి.. అలా చేయాలి అని ఊహల్లో బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం మా ‘కలియుగపట్టణంలో’ అన్నారు దర్శకుడు రమాకాంత్‌రెడ్డి.
Cinema News | ‘ప్రస్తుతం చాలామంది తండ్రులు సోషియో ఫోబియోతో ఉన్నారు. పిల్లల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా, నా కొడుకు ఇలా ఉండాలి.. అలా చేయాలి అని ఊహల్లో బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం మా ‘కలియుగపట్టణంలో’ అన్నారు దర్శకుడు రమాకాంత్‌రెడ్డి. విశ్వకార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ కందుల చంద్రఓబుల్‌రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ నిర్మాతలు. ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు రమాకాంత్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. కలియుగంలో మనుషుల పోకడలు ఎలా ఉంటున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా అని, ఈ కథలో చక్కని సందేశంతోపాటు తల్లి సెంటిమెంటూ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని దర్శకుడు చెప్పారు.
ఇంకా చెబుతూ ‘నా జీవితంలో నేను చూసిన సంఘటనల ఆధారంగా ఈ కథ తయారుచేసుకున్నాను. ఇందులో మంచి సందేశం ఉంది. సినిమాను కొందరు సినీపెద్దలకు వేసి చూపించాం. అందరికీ నచ్చింది. కథ, కథనాలేకాదు.. సాంకేతికంగా కూడా సినిమా బావుందని మెచ్చుకున్నారు. అజయ్ అరసాద సంగీతం, చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి గొప్ప సంస్థ మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు దర్శకుడు రమాకాంత్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

