యువ హీరోలు ప్రిన్స్, ఆగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలి’. శివ శేషు దర్శకుడు. రుద్ర క్రియేషన్స్ పతాకంపై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను ‘హనుమాన్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ైట్రైలర్ చాలా థ్రిల్లింగ్ ఉందని, గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనిపిస్తున్నదని అన్నారు. కుటుంబ కష్టాలతో శివరామ్ అనే యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఓ అపరిచిత వ్యక్తి అతని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశాలతో ట్రైలర్ ఉత్కంఠను పంచింది. ‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువుని వెంటేసుకొని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే..’ అంటూ ప్రియదర్శి అందించిన వాయిస్ ఓవర్ కథలోని సోల్‌ని తెలియజెపుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి, సంగీతం: జీవన్‌బాబు, సమర్పణ: కె.రాఘవేంద్రరెడ్డి, రచన-దర్శకత్వం: శివ శేషు.