Kalanki Bhairavudu | శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘కాళాంకి భైరవుడు’. హారర్, థ్రిల్లర్ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజా కిరణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.హరిహరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎన్ రామారావు, శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను రాజశేఖర్, జీవిత లాంఛ్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో హీరో కాగడా పట్టుకుని వెళ్తున్నట్లు ఉండగా.. చుట్టూ పుర్రెలు, వెనుక పొట్టేలు ఉండి భయంకరంగా ఉంది.
ఫస్ట్ లుక్ లాంచింగ్ సందర్భంగా సినిమా నిర్మాతలు మాట్లాడుతూ.. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కాగా, కాళాంకి భైరవుడు చిత్రంలో ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేశ్, బలగం జయరాం, భవ్య, మహమ్మద్ బాషా, బిల్లి మురళి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.