ఎం.ఎన్.వి.సాగర్, శృతిశంకర్, వికాస్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఎం.ఎన్.వి.సాగర్ దర్శకనిర్మాత. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల యువ హీరో ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎం.ఎన్.వి. సాగర్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. పునర్జన్మ నేపథ్యంలో పరువు హత్యల కథాంశంతో తెరకెక్కించాం. ఐదు జంటల మధ్య కథ నడుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మేరుగు అరమాన్, రచన, నిర్మాత, దర్శకుడు: ఎం.ఎన్.వి.సాగర్.