ఎం.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ సినిమా రిలీజ్డేట్ పోస్టర్ని విడుదల చేసిన హీరో శివాజీ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఎం.ఎన్.వి.సాగర్ మాట్లాడుతూ ‘అయిదు జంటల మధ్య జరిగే సంఘర్షణల మేళవింపు ఈ సినిమా. యువతరం మెచ్చే అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి.
సెకండాఫ్లో శివుడిపై ఉండే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ద్వారా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నాం. ఆగస్ట్ 29న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. శృతిశంకర్, వికాస్, విహారిక చౌదరి, అభిలాష్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ప్రసాద్, సంగీతం: మేరుగు అరమాన్, నిర్మాణం: ఎస్.ఎం.4 ఫిల్మ్స్