Kalaavathi song from Sarkaru Vaari Paata | ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా తమ సినిమా పాట విడుదల చేయాలనుకున్నారు సర్కారు వారి పాట టీం. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్లు.. ఈ పాట ముందే లీక్ కావడంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది చిత్ర యూనిట్. చేసేదేమీ లేక అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే పాటను విడుదల చేశారు. ఒరిజినల్ కళావతి వచ్చేసింది అంటూ ప్రమోషన్ కూడా చేశారు. ఇక పాట విషయానికి వస్తే మరోసారి మాయ చేశాడు తమన్. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకు అదిరిపోయే పాటలు అందిస్తున్న ఈ సంగీత దర్శకుడు.. సర్కారు వారి పాటకు కూడా తక్కువేమీ తినలేదు. మొన్న విడుదలైన ప్రోమో సాంగ్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది.
ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంట చూడముచ్చటగా ఉన్నారు. దానికి తోడు ఇప్పటివరకు తెలుగు సినిమాలో చూడని లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించాడు దర్శకుడు పరశురామ్. దాంతో మరింత అందంగా మారిపోయింది కళావతి పాట. కమాన్ కమాన్ కళావతి అంటూ మహేశ్ బాబు కూడా స్టెప్పులు వేశాడు. సిధ్ శ్రీరామ్ తనదైన స్టైల్లో ఈ పాటను రక్తి కట్టించాడు. విడుదలైన మరుక్షణం నుంచి కళావతి మహేష్ బాబు అభిమానులకు తారకమంత్రంగా మారిపోయింది.
ఈ పాటను కొందరు సోషల్ మీడియాలో ముందుగానే వినేశారు. అయితే అందులో సౌండ్ క్లారిటీ బాగాలేదు. దాంతో ఒరిజినల్ లిరికల్ సాంగ్ అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని.. ఖచ్చితంగా అవి కూడా అందర్నీ ఆకట్టుకుంటాయని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మే 12న సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్థిక నేరాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది.
సర్కారు వారి పాటపై మహేశ్‌బాబు ఫోకస్.. షూటింగ్లో పాల్గొనేది ఎప్పుడంటే..”
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!”