Kajol | బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. స్పష్టమైన అభిప్రాయాలతో ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడే కాజోల్, ఈసారి మాత్రం మరింత బోల్డ్‌గా “పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి… అలాగే రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలి” అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా అజయ్ దేవగన్‌తో ఆనందంగా జీవిస్తున్న కాజోల్ నుంచే ఇలాంటి సమాధానం రావడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ట్వింకిల్ ఖన్నాతో కలిసి కాజోల్ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘Too Much with Kajol and Twinkle’ తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్ & కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ట్వింకిల్, “వివాహానికి గడువు తేదీ మరియు తరువాత రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు. విక్కీ, కృతి, ట్వింకిల్ ముగ్గురు కూడా “వద్దు” అని చెప్పి రెడ్ జోన్లో నిలబడగా… కాజోల్ మాత్రం “అవును” అని చెప్పి గ్రీన్ జోన్లోకి వెళ్లి అందరినీ షాక్‌కు గురిచేశారు.అప్పుడు ట్వింకిల్ ఖన్నా సరదాగా.. “అది పెళ్లి… వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని కామెంట్ చేయగా, కాజోల్ వెంటనే తన అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు. సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు అని కాజోల్
తన ఆలోచనను వెల్లడించారు. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరూ హామీ ఇవ్వలేరు. పెళ్లికి గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది అని పేర్కొంది.
కాజోల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా, వీటిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కాజోల్ అభిప్రాయాన్ని “మోడ్రన్ థింకింగ్” అంటూ సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటి మాటలు అనవసరమైన డిబేట్లకు దారి తీస్తాయి” అంటూ విమర్శిస్తున్నారు. అదే షోలో “డబ్బుతో హ్యాపీనెస్ కొనగలరా?” అనే ప్రశ్న రాగా కాజోల్ మాట్లాడుతూ.. డబ్బు ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం అని అన్నారు. కాజోల్ బోల్డ్ కామెంట్స్, నిస్సందేహమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిపై ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.