అపరిచితురాలు ఉమ

పెళ్లి తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలకు ప్రాధాన్యమిస్తోంది కాజల్. మహిళా ప్రధాన ఇతివృత్తాలు, చాలెంజింగ్ రోల్స్‌పై దృష్టి సారిస్తున్న ఆమె తాజాగా బాలీవుడ్లో ‘ఉమ’ అనే ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తథాగథ సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. రాజవంశానికి చెందిన కుటుంబంలో జరిగే వివాహ వేడుక నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకలోకి అపరిచితురాలైన ఉమ అనే యువతి రంగప్రవేశంతో ఏం జరిగిందనే కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. నటనాపరంగా చాలెంజింగ్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథలకు తాను ప్రాముఖ్యతనిస్తానని, ‘ఉమ’ ఆ కోవకు చెందిన సినిమాయేనని కాజల్ అగర్వాల్ తెలిపింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతామని.. సెట్స్‌లో అడుగుపెట్టడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్ వెల్లడించింది. అవిషేక్ ఘోష్, మంత్రారాజ్ పలివాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆచార్య’తో పాటు నాగార్జునతో మరో సినిమా చేస్తోంది కాజల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

