The India Story | బాలీవుడ్ నటులు కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సోషియో నేషనల్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ’ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్స్ & స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెత్తన్ డీకే దర్శకత్వం వహిస్తుండగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమిత్ బగడే, అనితా జాదవ్, వినాయక్ సైదానీ, కల్పేష్ షా, దేవయాని ఖోరటే, ప్రేమ్ జోషి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా ఉన్నారు.
ఈ టీజర్ చూస్తుంటే.. దేశంలో తీవ్రమవుతున్న ఆహార కల్తీ, వ్యవసాయంలో రసాయనాలు, పురుగుమందుల మితిమీరిన వాడకం వెనుక ఉన్న కుంభకోణాల చుట్టూ ఈ చిత్ర కథ సాగనుంది. బాంబే హైకోర్టు నేపథ్యంలో గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో, శ్రేయాస్ తల్పడే ఆందోళనలో ఉన్న తండ్రి పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ 2026 జూలై 24న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.