నా కెరీర్లోనే రామాయణ ప్రత్యేకం
ప్రస్తుతం దేశంలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో అత్యంత భారీ సినిమా ఏది? అనంటే ఠక్కుమని వచ్చే సమాధానం ‘రామాయణ’.
ప్రస్తుతం దేశంలో రూపొందుతున్న భారీ చిత్రాల్లో అత్యంత భారీ సినిమా ఏది? అనంటే ఠక్కుమని వచ్చే సమాధానం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై దాదాపు మూడువేల కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. రావణ పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటిస్తుండగా, రావణుడి భార్య మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తున్నట్టు ఇన్నాళ్లూ వార్తలొచ్చాయి.
తాజాగా ఈ విషయాన్ని కాజల్ కూడా ధృవీకరించింది. ఓ అవార్డు వేడుకకు హాజరైన కాజల్ ‘రామాయణ’ గురించి మాట్లాడుతూ “రామాయణ’లో మండోదరిగా నటిస్తున్నాను. నా కెరీర్లో ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేయడం ఇదే ప్రథమం. అందరిలాగే ఈ సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నారు కాజల్. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

