కొన్ని పాత్రలకు ముందు ఒకర్ని అనుకోవడం.. తర్వాత ఆ స్థానాల్లో వేరొకరు వచ్చి చేరడం సినిమా పరిశ్రమలో కామన్. అగ్ర హీరో బాలకృష్ణ కథానాయకుడిగా మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో ఇప్పుడు అదే జరిగిందట. ఈ సినిమాలో కథానాయికగా ముందు నయనతారను అనుకున్నారు. నయన్ కూడా ఓకే చెప్పింది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ స్థానంలోకి కాజల్ అగర్వాల్ వచ్చి చేరిందట.
వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమా నుంచి నయన్ తప్పుకోవడంతో ఆ పాత్ర కాజల్‌ని వరించింది. అందుతున్న సమాచారం ప్రకారం నయన్ వదులుకున్నది సామాన్యమైన పాత్ర కాదట. బాలకృష్ణ పాత్రను ఢీకొట్టేంత శక్తివంతంగా ఆ పాత్ర ఉంటుందట. అలాంటి పాత్ర దక్కడం నిజంగా కాజల్ అదృష్టమే. బాలయ్యతో ఆల్రెడీ ‘భగవం త్ కేసరి’లో కాజల్ నటించిన విషయం విదితమే.