‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌కి ఇటీవలే కొబ్బరికాయ కొట్టారు. ఇక దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి. త్వరలోనే ఓ భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు సందీప్‌రెడ్డి వంగా. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ఊహించని సర్ప్రైజ్లు, క్యామియో రోల్స్ చాలా ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో షాహిద్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారట. గతంలో షాహిద్, సందీప్‌రెడ్డి వంగా కలయికలో ‘కబీర్‌సింగ్’ వచ్చిన విషయం తెలిసిందే.
ఆ స్నేహంతోనే షాహిద్ ఇందులో నటించేందుకు అంగీకరించారట. మరి ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో చూడాలి. కాగా, త్వరలో మొదలు కానున్న షెడ్యూల్లో హీరో ప్రభాస్‌పై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. ఇవి సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్‌తో ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయట. పవర్ఫుల్ కాప్ స్టోరీగా రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.