KA Paul – Cm Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ధర్నాలు, గొడవలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. ఒకరోజు రైతులతో గొడవ జరిగితే వారికి బేడీలు వేయిస్తాడు. ఆ తర్వాత సర్పంచులు వస్తే వారిని అరెస్టు చేయిస్తాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే అరెస్టు చేసి నోర్లు మూయించడంతో పాటు.. పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తున్నాడు అంటూ పాల్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా రేవంత్ రెడ్డి డిక్టేటర్లా మారిపోయాడు. చట్ట విరుద్దంగా సొంత చట్టం పెట్టి 482 బిల్డింగ్లను నోటీసులు ఇవ్వకుండా కూల్చేశాడు. కానీ తమ్ముడి బిల్డింగ్ మాత్రం కూల్చకుండా వదిలేశాడు అంటూ కేఏ పాల్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు
రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే
ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు
ఇంకోరోజు సర్పంచులు వస్తే వారిని అరెస్టు చేయిస్తాడు
నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే అరెస్టు చేయిస్తాడు… pic.twitter.com/4d2A8s8RRF
— Telugu Scribe (@TeluguScribe) December 24, 2024