K. Vijaya Bhaskar – Trivikram | టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్‌కు సీనియర్ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ మధ్య గొడవలు అయినట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై కె.విజయ్‌భాస్కర్ స్పందించాడు.
నాకు త్రివిక్రమ్‌కు ఎటువంటి గొడవలు లేవు అవి ఫేక్ వార్తలు నమ్మకండి. త్రివిక్రమ్ ఈ మధ్యనే మా సినిమా షూటింగ్ సెట్‌కు కూడా వచ్చాడు. షూటింగ్లో మా అందరితో సరదాగా గడిపాడు అని తెలిపాడు . కె.విజయ్‌భాస్కర్ దర్శకుడిగా, త్రివిక్రమ్ రచయితగా.. ఈ ఇరువురి కాంబినేషన్లో నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు రూపొందాయి. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తరువాత విజయ్‌భాస్కర్ దర్శకుల రేసులో వెనుకబడ్డాడు.
తాజాగా ఆయన తన తనయుడు హీరోగా ఉషాపరిణయం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ తనకు త్రివిక్రమ్‌తో ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉషా పరిణయం కథను ప్రేమకు నేను ఇచ్చే నిర్వచనంలా రూపొందించాను. ప్రేమ అనేది హింసాత్మకంగా వుండకూడదు. హింస్మాతకంగా వుంటే అది ప్రేమకాదు.
అయితే నేటి రోజుల్లో ప్రేమ ఈ విధంగా మారిపోవడం ఎంతో భాదాకరం. అందుకే ఈ చిత్రం ద్వారా నిజమైన ప్రేమను చెప్పబోతున్నాను. ఈ విషయాన్ని ఓ మేసేజ్లా కాకుండా ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కథతో పూర్తి వినోదాత్మకంగా నా స్టయిల్లో చెబుతున్నాను’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ నా దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు కథ చిరంజీవికి మ్యాచ్ అవ్వదు. జై చిరంజీవ వెంకటేష్‌కు సరిపోదు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్‌ను తప్ప ఎవరినీ ఊహించుకోలేం. అలాగే ఈ సినిమా కథ ఓ కుర్రాడి కోసం తయారుచేసిన కథ. ‘ఉషా పరిణయం’ కేవలం నా కొడుకు కోసమే తయారుచేసిన కథ కాదు. ఈ కథకు అతను సరిపోయాడు. సినిమా చేసిన తరువాత ఇది కమల్ కోసమే చేసిన కథలా అనిపించింది’ అన్నారు. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష జంట విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.