Jyothika | ఒక మహిళా అభిమాని సోషల్ మీడియాలో ఇచ్చిన రిైప్లె నటి జ్యోతికను అయోమయంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. ‘సైతాన్’ సినిమాతో సక్సెస్ కొట్టి మంచి జోష్‌మీద ఉన్నది జ్యోతిక. ఈ సందర్భంగా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ, ఓ వైపు తన ఆనందాన్ని పంచుకుంటూ, మరోవైపు సినిమా ప్రమోషన్ కూడా కానిచ్చేస్తున్నది జ్యోతిక. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఓ పోస్ట్ తన ఇన్‌స్టాలో పెట్టింది. దీనిపై ఓ లేడీ నెటిజన్ స్పందిస్తూ.. ‘మేడమ్.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా?.. నేను పదిహేనేళ్ల నుంచి ఆయన వీరాభిమానిని మేడమ్.. ప్లీజ్..’ అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై జ్యోతిక స్పందిస్తూ ‘అది మాత్రం కుదరదు’ అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చేసింది.
ఒక్కసారి జ్యోతిక తన కామెంట్‌కి రిప్లయ్ ఇవ్వడంతో సదరు నెటిజన్‌కి ఆనందం కట్టలు తెగింది. ‘ఓ మై గాడ్.. ఆయన ఎప్పటికీ మీవారే..’ అంటూ సమాధానం ఇచ్చింది. అసలు ఆ నెటిజన్ ఆ విధంగా ఆడగటానికి కారణం లేకపోలేదు. పదిహేనేళ్ల క్రితం జ్యోతిక, సూర్య కలిసి ‘నువ్వు నేను ప్రేమ’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో కథ రీత్యా జ్యోతిక.. ఒక రోజుపాటు సూర్యని ఆయన మాజీ ప్రియురాలి వద్దకు పంపిస్తుంది. ఆ సన్నివేశం గుర్తు చేస్తూ నెటిజన్ ఆ కామెంట్ పెట్టిందన్నమాట. దానికి జ్యోతిక కూడా స్పాంటేనియస్‌గా స్పందించడంతో ప్రస్తుతం అది సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నది.