Junior | మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన తొలి చిత్రం ‘జూనియర్’, థియేటర్లలో సత్తా చూపించకపోయిన ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలో కిరీటికీ జోడిగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటించింది. జూలై 18న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, కిరీటి డాన్స్ మూవ్స్, శ్రీలీల గ్లామర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఈ సినిమా ఓటీటీలో సెప్టెంబర్ 22 నుండి స్ట్రీమ్ కావాల్సి ఉన్నా, తాత్కాలిక కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తాజాగా కొత్త తేది ప్రకటించింది. ‘జూనియర్’ సినిమా సెప్టెంబర్ 30న నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా ట్వీట్లో..“సీనియర్‌కు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ అని జూనియర్ 30కి వస్తున్నాడు!”అంటూ క్రియేటివ్ క్యాప్షన్‌తో సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఇందులో స్టోరీ అంతా కూడా అభి (కిరీటి రెడ్డి) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. చిన్ననాటి నుంచి తండ్రి చూపించే ఓవర్ ప్రేమను భరించలేని అభి, ఫ్రెండ్స్‌తో తన ఇంజినీరింగ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని ఆశిస్తాడు. చదువు పూర్తయ్యాక తండ్రికి దూరంగా ఉండేందుకు ఉద్యోగానికి చేరతాడు, అదే కార్యాలయంలో తన ఫస్ట్ లవ్ స్ఫూర్తి (శ్రీలీల) ను కలుసుకుంటాడు.
అయితే అక్కడే స్ట్రిక్ట్ బాస్ విజయ (జెనీలియా)తో అభికి ఫస్ట్ టైమ్ బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల వల్ల విజయకు నచ్చని ఊరికి, అభితో కలిసి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఆ ఊరికి విజయకు ఉన్న అనుబంధం ఏంటి? అభి తండ్రి పాత్రకి ఆ ఊరి లింక్ ఏమిటి? అన్నదే కథ . రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, రావు రమేశ్, వైవా హర్ష, సత్య, సుధారాణి, అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన ఎదురైన , ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రీలీల గ్లామర్, కిరీటి ఎనర్జీ, ఎమోషనల్ డ్రామాతో పాటు మ్యూజిక్ హైలైట్ కావొచ్చని అర్థమవుతోంది.