
NTR 30 | జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో సినిమా చేయాలి అంటే మరో మూడేళ్ల వరకు వేచి చూడాల్సిందే. అందుకే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కథ సిద్ధంగా ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దాదాపు మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు తారక్. మళ్లీ అందులో అన్ని సినిమాలు స్టార్ డైరెక్టర్లతోనే ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తయిన తర్వాత కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో స్టూడెంట్ లీడర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం కొరటాల చాలా హోం వర్క్ చేస్తున్నాడు.

ప్రస్తుతం అయిన ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కొరటాల శివ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో గెలవడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంతకీ ఏంటా పరీక్ష అనుకుంటున్నారా.. చాలా సింపుల్.. బరువు తగ్గాలి. రాజమౌళి సినిమా కోసం చాలా బరువు పెరిగాడు జూనియర్ ఎన్టీఆర్. కొమ్రం భీం క్యారెక్టర్ కోసం తనను తాను మార్చుకున్నాడు. బరువు పెరిగి మునుపటిలా బొద్దుగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. దాంతో ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గే పనిలో బిజీ అయిపోయాడు ఎన్టీఆర్. కనీసం 10 నుంచి 15 కేజీలు తగ్గాలని దర్శకుడు కొరటాల కోరినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పటి నుంచే ఈ సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. దసరాకు కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు బరువు తగ్గి క్యారెక్టర్ కోసం పర్ఫెక్ట్ ఫిట్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
స్టార్ హీరోయిన్ ఇంట్లో డ్రగ్స్, మద్యం లభ్యం..అదుపులోకి తీసుకున్న పోలీసులు
కియారాను నయనతారతో పోల్చిన డైరెక్టర్
సమంత రిస్కీ వర్కవుట్స్ వీడియో వైరల్
బాలకృష్ణ మూవీ..సింపుల్గా తప్పించుకున్న శృతిహాసన్