ఆర్ఆర్ఆర్ సినిమా అనేది కేవలం ఒక సినిమా కాదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ కేవలం ఒక చిత్రం కాదు.. రీజనల్ సినిమాల బారియర్స్‌ను తుడిపివేసిన తన చిత్రాల ద్వారా భారతదేశ యూనిటీని కలపాలనుకునే ఒక గొప్ప దర్శకుడి కల. రాబోయే తరాలకు నిదర్శనం కాబోతున్న చిత్రం ఇది. అటువంటి ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కల్పించినందుకు నిజంగా జక్కన్నకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేసినటువంటి ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఉన్నారన్నారు.
ఈ సినిమాను ఒక మైలురాయిగా తీర్చిదిద్దాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. నా జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు నా అభిమానులు. ఈరోజు మీ అభిమానంతో పాటు మా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. ఎప్పుడూ ఇలాగే ఆనందంగా మీరు ఉండాలని ఆదేవుడిని మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎంత సఖ్యతతో ఉంటే ఇంకా గొప్ప సినిమాలు వస్తాయి. మీరు ఇంత దూరం వచ్చి సహనంతో ఇక్కడ వెయిట్ చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
ముగించే ముందు చరణ్ గురించి చెప్పాలి. దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మన ఫ్రెండ్షిప్ దిష్టి తగలకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని తారక్ అన్నారు.