ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇది నిజంగా ఆయన అభిమానులకు శుభవార్తే. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా..అందులో ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం కర్ణాటక మంగళూరులో మొదలైన తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ భారీ స్థాయిలో వేసిన పోర్ట్సెట్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రవిబస్రూర్ స్వరకర్త. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.