Jr NTR New Movies Update | తన కొత్త సినిమాల గురించి చెప్పిన ఎన్టీఆర్
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం పారిస్ టూర్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ మీడియా హౌజ్‌తో చేసిన చిట్‌చాట్‌లో కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాడు తారక్.

ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం పారిస్ టూర్లో బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి సరదా సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొడుకులతో దిగిన స్టిల్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొంత విరామం తీసుకున్న తర్వాత మళ్లీ ఎన్టీఆర్ 30 (NTR30), ఎన్టీఆర్ 31 (NTR31)ప్రాజెక్టుల కోసం మేకప్ వేసుకోబోతున్నాడు. కాగా ప్రముఖ మీడియా హౌజ్‌తో చేసిన చిట్‌చాట్‌లో కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాడు తారక్.
ముందుగా కొరటాల శివతో చేయనున్న సినిమా గురించి చెప్పాడు. రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని లీక్ ఇచ్చేశాడు ఎన్టీఆర్. అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పాడు. ఇక 31వ ప్రాజెక్టు గురించి చెప్తూ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా కేజీఎఫ్ లా భారీ హంగులతో తెరకెక్కనున్నట్టు చెప్పాడు. 2022 అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్తుందన్నాడు. ఎన్టీఆర్ ఇచ్చిన ఈ రెండు అప్డేట్తో ఫుల్ జోష్ మీదున్నాడరు నందమూరి అభిమానులు.
తమ అభిమాన హీరో కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ఆర్ఆర్ఆర్ 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

