NTR | ఈ ఏడాది మొత్తం వరుస సినిమాలతో బిజీబిజీగా గడపనున్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ఇప్పటికే తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రం ‘వార్-2’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. త్వరలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ‘దేవర-2’ సైతం ఈ ఏడాదిలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్లోనే ‘దేవర’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌పై తన టీమ్‌తో పనిచేస్తున్నారు.
ఇదిలావుండగా ఇటీవల ‘దేవర’ సినిమా జపాన్ రిలీజ్ నేపథ్యంలో అక్కడకు వెళ్లి అభిమానులను కలుసుకున్నారు ఎన్టీఆర్. స్థానిక మీడియాతో కూడా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ‘దేవర-2’ గురించి ఆయన ఇచ్చిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్లో వర పాత్ర గురించి ప్రేక్షకులు ఎక్కువగా తెలుసుకుంటారని, అసలు దేవరకు ఏమైంది అనే బ్యాక్‌స్టోరీకి సమాధానం కూడా సీక్వెల్‌నే ఉంటుందని, అనేక ప్రశ్నలకు సమాధానంగా రెండో భాగం నిలుస్తుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ తాజా అప్డేట్తో సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.