Jr NTR| ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిగా ఉన్నారు. ఆయనకి ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ ఇమేజ్ కూడా దక్కింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు జూనియర్. ప్రస్తుతానికి వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ తో కలసి నటిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ఇటీవలే ప్రారంభం కాగా, ఈ సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ గత పదేళ్లుగా పరాజయం అనే మాటే వినకుండా దూసుకుపోతున్నాడు.
టెంపర్ చిత్రం నుండి ఎన్టీఆర్ వరుస హిట్స్‌తో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ కెరీర్ ఇలా లేదు. ఒక దశలో తారక్ దారుణమైన ఫ్లాపులు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఓ ఇంటర్వ్యూలో తారక్ తాను 20 ఏళ్ల వయస్సులో చేసిన తప్పు వలన కొన్నేళ్లు వేదన అనుభవించినట్టు చెప్పుకొచ్చారు. దానివల్ల కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడింది అని అన్నారు. 17 ఏళ్ళ వయసులో హీరోని అయ్యా. తొలి చిత్రం డిజాస్టర్ కాగా, అది గ్రహించే లోపే స్టూడెంట్ నంబర్ 1, ఆది లాంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ఆ తర్వాత 20 ఏళ్ళ వయసులో సింహాద్రి చిత్రంతో టాప్ స్టార్ డమ్ కి చేరుకున్నా.
అప్పుడు నేను స్టార్డమ్ హ్యాండిల్ చేయడంలో కొంత ఫెయిల్ అయ్యాను. ఎందుకో సింహాద్రి తర్వాత ఎలాంటి చిత్రం చేసిన కూడా విమర్శలు వచ్చేవి. డ్యాన్స్‌లు చేసిన విమర్శించేవారు. ఫైట్స్ చేసిన విమర్శించారు… రాఖి లాంటి చిత్రం చేసిన బాగుంది అన్నారు కాని కలెక్షన్స్ రాలేదు. ఆ సమయంలో ఫ్యాన్స్ కొందరు నా దగ్గరకి వచ్చి హిట్ కావాలని అడుగుతూ ఏగ్చేశారు. అప్పుడు వారితో పాటు నాకు కంట కన్నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత యమదొంగ చిత్రం చేయగా, ఆ సినిమా హిట్ అయింది. తర్వాత ఫ్లాపులు వచ్చాయి. అయితే నాకు అభయ్ రామ్ జన్మించిన తర్వాత ఆడియన్స్ నిజాయతీతో కూడిన ప్రయత్నం, చిత్రాలు కోరుకుంటున్నారని తెలిసింది అని తారక్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.