Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే దేవర నుంచి లాంఛ్ చేసిన ఫియర్ సాంగ్ (fear song) నెట్టింటిని షేక్ చేస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట మిలియన్లకుపైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా నయా షూటింగ్ షెడ్యూల్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తారక్ ఫ్యామిలీ అండ్ దేవర టీంతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఇవాళ ఉదయం థాయ్‌లాండ్‌లో ల్యాండైంది తారక్ టీం. ఈ షెడ్యూల్లో జాన్వీకపూర్, తారక్‌పై వచ్చే సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఓ వైపు షూటింగ్‌కు హాజరవుతూనే.. మరోవైపు ఫ్యామిలీతో కలిసి సరదా ట్రిప్‌కు సమయం కేటాయించాలనుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్.
దేవర నుంచి లాంఛ్ చేసిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. జాన్వీకి దేవర తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇప్పటికే దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ AllHailTheTiger స్టన్నింగ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సెగలు పుట్టిస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.