ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి పార్ట్ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఈ ఫ్రాంచైజీని తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ చెబుతున్నారు.
ఇప్పటికే ప్రచారంలో భాగంగా విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఇదిలావుంటే.. సినిమా విడుదల దగ్గరపడుతున్న సందర్భంగా ఈ నెల 10న ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహలు చేస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ డేట్‌పై అధికారికంగా ఇంకా క్లారిటీ రావాల్సివుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు.