‘వార్ 2’తో దేశవ్యాప్తంగా సందడి చేసిన ఎన్టీఆర్.. నెక్ట్స్ ఏ సినిమా చేయబోతున్నారు? అనేది అభిమానుల్లో నెలకొని ఉన్న ప్రశ్న. ‘దేవర 2’ సినిమా ఇక తారక్ చేయరని, త్రివిక్రమ్ సినిమాను ఆయన లైన్లో పెడతారని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. వాటన్నింటికీ తెర దించుతూ ఎన్టీఆర్ ‘దేవర 2’ చేసేందుకు సిద్ధం అయ్యారు.
డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. మరోవైపు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది చివర్లో గానీ, 2027 సంక్రాంతికి గానీ ‘దేవర 2’ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నది.