రీసెంట్గా వచ్చిన ట్రిపుర్ ఆర్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ (NTR). మరోవైపు కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్లో ఎన్టీఆర్ 30, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులు కూడా ప్రకటించేశాడు. అయితే ఈ రెండు సినిమాల షెడ్యూల్ ఇంకా ఫైనల్ కాలేదు. వీటిలో మొదట కొరటాల ప్రాజెక్టు షురూ చేయబోతున్నాడు. కొత్త సినిమాలు మొదలుపెట్టే ముందు హాలీడే ట్రిప్ వేసుకున్నాడు తారక్.
సింగపూర్‌లోని ప్రముఖ టీఎస్ఎంబీఎస్ మాల్లో ఎన్టీఆర్ తన స్నేహితులతో కలిసి ఛిల్ అవుట్ అవుతున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న కొరటాల సినిమాలో తారక్ ఈ సారి కొత్త లుక్‌లో మెరవబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. జనతా గ్యారేజీ లాంటి హిట్ సినిమా తర్వాత కొరటాల-తారక్ క్రేజీ కాంబోలో వస్తున్న రెండో సినిమాకావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.